Tag Archives: #telugu

TANTEX Nela Nela Telugu (NNTV) Vennela 177th Literary Seminar 2022

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 10న జరిగిన 177 వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. కోవిడ్ వలన గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జూం లో జరుపుకుంటూ ఉన్నాము. ఈసారి అందరి మధ్యలో మరియు జూం తో కలిపి అహ్లాదంగా జరుపుకున్నాము. సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన అంతర్జాలంలో మరియు సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారములు తెలిపారు. అంతర్జాలంలో గోవర్ధనరావు నిడిగంటి, రాధ […]

TATA Fundraising event in Dallas, Texas

Dallas TTA (Telangana American Telugu Association) Convention kick of event was held on Sunday, March 13, 2022 . Many of the TTA members and well wishers from other local and National Telugu Organizations leaders. attended the event. Dr.Sreedhar Korsapati, President of NATA graced the occasion. Raju Anandesh, Dallas in charge and Regional Vice President welcomed […]

TANTEX Women’s Day Celebrations-2022

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) డల్లాస్ నగరంలోని, ఫుడిస్తాన్ రెస్టారెంట్ లో మార్చి 13 వ తేదీ ఆదివారం రోజున మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి ఆధ్వర్యాన, వనితా వేదిక నాయకులు కళ్యాణి తాడిమేటి, మరియు కార్యనిర్వాహక బృంద సభ్యులు, లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, శరత్ రెడ్డి ఎర్రం , సురేష్ పఠనేని , నీరజ కుప్పచ్చి, స్రవంతి యర్రమనేని, మాధవి లోకిరెడ్డి, […]

TANA Foundation Graduate Scholarships distributed at Dallas,Texas

మార్చి 03, డాలస్( టెక్సస్): డల్లాస్‌లోని తానా ఫౌండేషన్..పలువరు తెలుగు విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందించి వారి బంగరు భవిష్యత్తుకు బాటలు వేసింది. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపుతో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో విద్యకు వున్న ప్రాధాన్యత చాల గొప్పదని, విద్యవలన విజ్ఞానం వస్తుందని, […]

డాలస్ లో విజయవంతంగా జరిగిన తానా కళాశాల అభినందన కార్యక్రమం

డల్లాస్ , టెక్సాస్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తానా కళాశాల’ అభినందన కార్యక్రమాన్ని తానా DFW కార్యవర్గం ఫ్రిస్కో లోని శుభం ఈవెంట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యవర్గం తో పాటు పలువురు కళాప్రియులు విచ్చేసి కళాశాల కార్యక్రమ వివరాలతో  పాటుగా A2B వెజిటేరియన్ రెస్టారెంట్ మరియు కొప్పెల్ పీకాక్ రెస్టారెంట్ వారి పసందైన విందు భోజనాన్ని కూడా ఆస్వాదించారు.  ఈ కార్యక్రమాన్ని తానా DFW ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన స్వాగతోపన్యాసం, సంగీత గురువు సమీరా శ్రీపాద ప్రార్థనా గీతంతో  ప్రారంభించారు. అనంతరం తానాకళాశాల చైర్మన్ డా. రాజేష్ అడుసుమిల్లి, కొ-చైర్ మాలతీ […]

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా172వ సాహిత్య సదస్సు

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 21న జరిగిన 172వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో దీపావళి పండగ సందర్భంగా సంస్థ అద్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణపాలేటి గారు సదస్యులకు  శుభాకాంక్షలు తెలిపారు  చిన్నారి మాడ సమన్వితల ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా డాక్టర్  కొంపెల్ల భాస్కర్ గారు విచ్చేశారు. ఉపద్రష్ట సత్యం గారు ముఖ్య అతిథిని సభకు పరిచయంచేశారు. డాక్టర్ కొంపెల్ల భాస్కర్ గారు “విశ్వనాథ నవలలో స్త్రీ పాత్రలు” విశ్లేషిస్తూ చక్కటి ఉపన్యాసం చేశారు. వారు అమెరికా  విశ్వవిద్యాలయాలలో అచార్యునిగా, పరిశోధకునిగా పని చేసి తరువాత ఇరవై ఏళ్ళుగామోటరోలా, జెనరల్ ఎలక్ట్రిక్ లో పని చేస్తున్నారు. ఇష్టమైన పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, సంగీతం వినడం వీరి అభిరుచులు. సంస్కృ, ఆంగ్ల సాహిత్యాలు, విభిన్న సంస్కృతులను అర్థంచేసుకోవడం, చారిత్రక కాల్పనిక సాహిత్యం, పద్య రచన, శాస్త్ర  పరిశోధన, సంస్కృత వ్యాకరణం, సాహిత్యంపైవ్యాసాలు వ్రాయడం వీరికి ఇష్టమైన అంశాలు.   అలాగే సాహిత్యం పై  వారికున్న అవగాహన, ప్రసంగ పటిమసభికులను విశేషంగా ఆకర్షించాయి. “పద్య సౌగంధం” శీర్షికన శ్రీ ఉపద్రష్ట సత్యం గారు విశేషాలువిశ్లేషించారు.  “మన తెలుగు సిరి సంపదలు”  ధారావాహికలో భాగంగా  ఉరుమిండి నరసింహా రెడ్డి గారు  కొన్ని పొడుపుకథలు, ప్రహేళికలు ప్రశ్నలు జవాబుల  రూపంలో సంధిస్తూ సభ్యులను భాగంచేశారు. శ్రీమతిఅరవిందా రావు గారు “పడుతుంది సమయం” గురించి వివరించారు. కార్యక్రమంలో చివరి అంశంగామాసానికో మహనీయుడు శీర్షికన ఈమాసంలో జన్మించిన విశిష్ట రచయితలను  శ్రీమతి అరుణ జ్యోతి గారుగుర్తు చేశారు.  ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్యసదస్సు సమన్వయకర్త శ్రీమతి నీరజా కుప్పచ్చి తదితర స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. సమన్వయకర్త విశిష్ట ముఖ్య అతిథులకు జ్ఞాపికలు చదివి వినిపంచారు. సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి వారు ముఖ్య అతిథి డాక్టర్ కొంపెల్ల భాస్కర్ గారికి, ప్రార్థనా గీతం పాడిన చిన్నారి మాడ సమన్విత తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకుఉత్తర టెక్సస్ తెలుగు  సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.