Notice: Trying to get property of non-object in /home/myfrbzpgjzbh/public_html/wp-content/plugins/pj-news-ticker/pj-news-ticker.php on line 201
BREAKING NEWS
US reaches COVID vaccine milestone of 100 million shots | Former BJP Leader Yashwant Sinha joins TMC Party

‘Climax’ movie releases

నటకిరీటి రాజేంద్రప్రసాద్ మల్టీ జానర్ చిత్రం “క్లైమాక్స్” కి U/A సర్టిఫికెట్, మార్చి 5న రిలీజ్!! కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా …

‘Raitanna’ Movie Coming Soon

 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో … పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ” రైతన్న”  ప్రముఖ సినీనటులు, దర్శక నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. …

కిరణ్మయి ఇంద్రగంటి దర్శకత్వంలో ‘రాళ్లలో నీరు’

అనేక  డాక్యుమెంటరీలు తీసి, చాలా రచనలు చేసి,  సినిమాపై  మంచి పరిజ్ఞానం కలిగిన కిరణ్మయి ఇంద్రగంటి  తొలిసారిగా డైరెక్ట్ చేసిన చిత్రం ‘రాళ్ళలో నీరు’.  అనల్ప  అండ్ ఫ్రెండ్స్ పతాకంపై అనల్ప ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ మంజూష, అల్తాఫ్, షఫీ, బిందు చంద్రమౌళి, డా. ప్రసాద్ ఇందులో ప్రధాన తారాగణం.  దర్శకురాలు కిరణ్మయి ఇంద్రగంటి మాట్లాడుతూ”నేను M.A ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకునే రోజుల్లో  నార్వేజియన్ నాటకం ‘ఏ డాల్స్ హౌస్’ విపరీతంగా ఆకట్టుకుంది. ఎప్పటికైనా ఆ నాటకాన్ని తెరకెక్కించాలనుకున్నాను. ఆ కల ఇప్పటికి నెరవేరింది. తెలుగులో ‘కన్యాశుల్కం’ ఎలానో, ఇంగ్లీషులో ‘డాల్స్ హౌస్’ అంత ఫేమస్. 19వ శతాబ్దానికిచెందిన ప్రముఖ రచయిత హెన్రిక్ ఇబ్సన్ ఈ నాటకం రాసారు. చలం తరహాలో ప్రోగ్రెసివ్థాట్స్ తో ఉండే ఈ నాటకం థీమ్ ని తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసాను. ఇందులో మొత్తం ఐదు పాత్రలే ఉంటాయి. మనుషుల్లోఅంతర్గతంగా ఉండే లోపాల్ని, భావోద్వేగాల్ని ఒడిసిపట్టే విధంగా ఇందులో కథాంశంఉంటుంది. కథకు తగ్గట్టుగా కాకినాడలో ఓ ఇల్లు దొరికింది. మేజర్ పోర్షన్ అక్కడే చిత్రీకరించాం.  కాకినాడలో మొత్తం 28 రోజులు షూటింగ్ చేశాం. ఫస్ట్ కాపీ తో సహా సినిమా రెడీ గా ఉంది. ఇటీవలే లాస్ ఏంజిల్స్ లో జరిగిన అవేర్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్నిప్రదర్శించాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని తెలిపారు.  ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఎడిటింగ్: మార్తాండ్ . కే. వెంకటేష్, కెమెరా: RR కోలంచి, సౌండ్ డిజైనర్: తేజ ASGK, నిర్మాత: అనల్ప,  రచన-దర్శ కత్వం: కిరణ్మయి ఇంద్రగంటి.

“Vitamin She” Telugu movie.

‘పేపర్ బాయ్’ చిత్రంతో దర్శకునిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న జయశంకర్ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంలో తాజాగా రూపొందించిన చిత్రం ‘విటమిన్ షి’.  షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తో యూట్యూబ్ లో ప్రాచుర్యం  పొందిన శ్రీకాంత్గుఱ్ఱం ఇందులో హీరోగా నటించారు. గుజరాతీ భాషలో రెండు సినిమాల్లో కథానాయికగానటించిన ప్రాచి ఇందులో హీరోయిన్ గా చేశారు. రంజిత్ రెడ్డి, వికాస్, మొయిన్, సంజీవ్ జోషి, అశోక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్  పతాకంపై రవి పోలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ”ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనుషుల జీవితాల్ని ఏ విధంగా ఆక్రమిస్తుందనేది ఈసినిమా మూల కథాంశం. మనకు సహాయకారిగా ఉంటుందనుకున్న ఈ ఆర్టిఫీషియల్ఇంటెలిజెన్సీ చివరకు మనల్నే డామినేట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లోఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది సెటైరికల్ గా ఈ సినిమాలో చూపించాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత టాప్ లెవెల్ కి వెళ్లినా… చివరకు మనుషుల్నేరీప్లేస్ చేసే స్థాయికి వచ్చినా కూడా, మనుషుల ఎమోషన్స్ ని రీప్లేస్ చేయడం మాత్రంవాటికి అసంభవం. వీటన్నిటినీ ఫన్ మోడ్ లో చూపించాం. ఈ సినిమాలో మొత్తంపన్నెడు పాత్రలు ఉంటాయి కానీ, ప్రధానంగా 4 పాత్రల చుట్టే సినిమా తిరుగుతుంది. లాక్డౌన్ టైమ్ లో ఈ చిత్రం షూటింగ్ చేశాం. స్టోరీ పరంగానే కాకుండా, టెక్నీకల్ గా కూడా హైస్టాండర్డ్స్ లో ఉంటుందీ సినిమా. ఇటీవలే ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల చేశాం. చాల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ కాపీతో సహా సినిమామొత్తం రెడీగా ఉంది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని తెలిపారు.  ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివప్రసాద్, సంగీతం: PVR రాజు, ఎడిటింగ్ : LN స్టూడియోస్ , నిర్మాత: రవి పోలిశెట్టి, రచన-దర్శకత్వం : జయశంకర్.