తెలుగు నేర్పించడమే తానా పాఠశాల లక్ష్యం

-

తానా పాఠశాల మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి అయినసందర్బంగా తానా నాయకత్వం ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ జూమ్ సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశానికి పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కో ఆర్డినేటర్స్ మరియు తానా నాయకత్వం హాజరయ్యారు.
తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారు మాట్లాడుతూ స్వచ్చందంగా భాషాభిమానంతో వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి తెలుగు బోదిస్తున్నటువంటి ఉపాధ్యాయుల సేవానిరతిని కొనియాడారు.
అలాగే పాఠశాల కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.
పూర్వ అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి గారి కుటుంబం పాఠశాలకు ప్రకటించిన రెండు లక్షల డాలర్ల విరాళానికి పలువురు ప్రశంశించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు తానా కార్యవర్గం తల్లిదండ్రుల నుండి వచ్చిన మంచి స్పందనను తెలియజేస్తూ, తమ సంతోషాన్ని వ్యక్తపరచారు.
ప్రస్తుత సంవత్సర రిజిస్ట్రేషన్ లలో తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల గారు మాట్లాడుతూ తెలుగు చిన్నారులందరికి తెలుగు నేర్పించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నామని, దీనికోసం తానా కార్యవర్గం, పాఠశాల టీమ్ సమిష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు.
ప్రసాద్ మంగిన గారు మాట్లాడుతూ పాఠశాల కార్యక్రమాలలో బాటా టీమ్ యొక్క సహకారాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ఏర్పాటు చేసిన పాఠశాల సమ్మర్ క్యాంపుకు సుమారు 500 మందికి పైగా చిన్నారులు హాజరయ్యారు. ఈ క్యాంపును వెంకట్ కొర్రపాటి గారు గణేశ ప్రార్ధనతో ప్రారంభించారు. అనంతరం రవి పోచిరాజు గారు చక్కని నీతి కథలు బోధించారు. తరువాత ప్రసాద్ మంగిన గారు బే ఏరియా చిన్నారులతో పలు ప్రదర్శనలు ఇప్పించారు.
తరువాత సత్య బుర్ర గారు పాఠశాల కరికులం గురించి వివరించారు. అంతేకాకుండా చిన్నారులకు క్విజ్ ను నిర్వహించారు. రజని మారం గారు చివరి శ్లోకాన్ని ఆలపించారు. కార్యక్రమంలో చివరిగా తల్లిదండ్రులు పాఠశాల రిజిస్ట్రేషన్ లో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
తానా కార్యవర్గం :
సతీష్ వేమూరి గారు
మురళి తాళ్లూరి గారు
రాజా కసుకుర్తి గారు
ఉమ కటికి గారు
లోకేష్ నాయుడు గారు
హితీష్ వడ్లమూడి గారు
పురుషోత్తం గారు
శ్రీకాంత్ పోలవరపు
శ్రీనివాస్ గారు
సతీష్ కొమ్మన గారు
సునీల్ కోగంటి
హనుమంతరావు గారు
ప్రదీప్ గడ్డం గారు
వంశీ వాసిరెడ్డి గారు
దిలీప్ ముసునూరు గారు
శ్రీనివాస్ గోగినేని గారు
సాయి బొల్లినేని గారు
రామ్ తోట గారు
రవి చంద్ర గారు
రత్నప్రసాద్ గుమ్మడి గారు
మొదలైన వారు హాజరై పాఠశాల రిజిస్ట్రేషన్స్ కు సహకరిస్తామని తెలియజేశారు.
పాఠశాల బృందం :
కృష్ణ నందమూరి గారు
ఫణి కంతేటి గారు
సాయి జరుగుల గారు
విక్రాంత్ గారు
శివనాగరాజు గారు
అనిల్ పోటు గారు
భాను మావులూరి గారు
శ్రీనివాస్ కూకట్ల గారు
వెంకట సింగు గారు
లక్ష్మి అద్దంకి గారు
శ్రీధర్ గారు
కృష్ణ మోహన్ గారు
సునీల్ దేవరపల్లి గారు
కళ్యాణ్ గారు మొదలైన పాల్గొన్నారు.
ఈ సమ్మర్ క్యాంపు ఇంకా మూడు శనివారాలు జరుగుతుందని పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల గారు తెలిపారు.

Category: