గోల్కొండ కోట లో బీజేపీ బతుకమ్మ పండుగ సంబురాలు

-

హైదరాబాద్ లోని గోల్కొండ కోట లో  08.10.2021 నాడు బీజేపీ  మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ మతి కే. గీతా మూర్తి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబురాలు సంతోషం తో జరువుకున్నారు. ఈ వేడుక కు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, ప్రఖ్యాత సీనియర్ నటి శ్రీ మతి రోజా రమణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రక రకాల పూల తో బతుకమ్మ ను అలంకరించి మహిళలు పెద్ద సంఖ్య లో ఆడి, పాడారు. కోట ప్రాంగణమంతా బతుకమ్మ పాటల తో, యువతులు, మహిళ ల సాంప్రదాయ నాట్యాల తో మారు మ్రోగినవి. హిందూ సేవా సమాజ ట్రస్ట్ శ్రీ మతి శోభ, శ్రీ బాల ప్రకాష్ మరియు వారి టీం సహకారం తో ఎంతో గొప్పగా ఈ పండుగ జరిగింది. రాష్ట్ర మహిళా మోర్చా ప్రభారీ, మాజీ శాసన సభ్యులు శ్రీ చింతల రామచంద్రా రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ మతి కల్యాణం గీతా రాణి, శ్రీ మతి సులోచన, జాతీయ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ శ్రీ మతి నళిని,  రాష్ట్ర కార్యవర్గ వర్గ సభ్యురాళ్లు,   జిల్లా ల అధ్యక్షురాళ్లు, కార్పొరేటర్లు, మొదలగు వారు పాల్గొని బతుకమ్మ పండుగ ను విజయ వంతం చేశారు. గీతా మూర్తి మాట్లాడుతూ తెలంగాణ లోని ఆడ పిల్లలను బతక నివ్వమని ఆ అమ్మ వారిని కోరుకున్నారు..

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *