ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా172వ సాహిత్య సదస్సు

-

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 21న జరిగిన 172వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో దీపావళి పండగ సందర్భంగా సంస్థ అద్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణపాలేటి గారు సదస్యులకు 

శుభాకాంక్షలు తెలిపారు 

చిన్నారి మాడ సమన్వితల ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ 

కొంపెల్ల భాస్కర్ గారు విచ్చేశారు. ఉపద్రష్ట సత్యం గారు ముఖ్య అతిథిని సభకు పరిచయంచేశారు.

డాక్టర్ కొంపెల్ల భాస్కర్ గారు “విశ్వనాథ నవలలో స్త్రీ పాత్రలు” విశ్లేషిస్తూ చక్కటి ఉపన్యాసం చేశారు. వారు అమెరికా 

విశ్వవిద్యాలయాలలో అచార్యునిగా, పరిశోధకునిగా పని చేసి తరువాత ఇరవై ఏళ్ళుగామోటరోలా, జెనరల్ ఎలక్ట్రిక్ లో పని చేస్తున్నారు. ఇష్టమైన పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, సంగీతం వినడం వీరి అభిరుచులు. సంస్కృ, ఆంగ్ల సాహిత్యాలు, విభిన్న సంస్కృతులను అర్థంచేసుకోవడం, చారిత్రక కాల్పనిక సాహిత్యం, పద్య రచన, శాస్త్ర 

పరిశోధన, సంస్కృత వ్యాకరణం, సాహిత్యంపైవ్యాసాలు వ్రాయడం వీరికి ఇష్టమైన అంశాలు.   అలాగే సాహిత్యం పై 

వారికున్న అవగాహన, ప్రసంగ పటిమసభికులను విశేషంగా ఆకర్షించాయి.

“పద్య సౌగంధం” శీర్షికన శ్రీ ఉపద్రష్ట సత్యం గారు విశేషాలువిశ్లేషించారు.  “మన తెలుగు సిరి సంపదలు” 

ధారావాహికలో భాగంగా  ఉరుమిండి నరసింహా రెడ్డి గారు  కొన్ని పొడుపుకథలు, ప్రహేళికలు ప్రశ్నలు జవాబుల 

రూపంలో సంధిస్తూ సభ్యులను భాగంచేశారు. శ్రీమతిఅరవిందా రావు గారు “పడుతుంది సమయం” గురించి వివరించారు. కార్యక్రమంలో చివరి అంశంగామాసానికో మహనీయుడు శీర్షికన ఈమాసంలో జన్మించిన విశిష్ట రచయితలను 

శ్రీమతి అరుణ జ్యోతి గారుగుర్తు చేశారు. 

ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్యసదస్సు

సమన్వయకర్త శ్రీమతి నీరజా కుప్పచ్చి తదితర స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. సమన్వయకర్త విశిష్ట ముఖ్య అతిథులకు జ్ఞాపికలు చదివి వినిపంచారు.

సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి వారు ముఖ్య అతిథి డాక్టర్ కొంపెల్ల భాస్కర్ గారికి, ప్రార్థనా గీతం పాడిన చిన్నారి మాడ సమన్విత తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకుఉత్తర టెక్సస్ తెలుగు 

సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *