ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ మీటింగ్ జయప్రదం

-

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ డీసీలో జరిగిన 17 వ ‘ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ మీటింగ్’లో 800 మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 17వ మహాసభల థీమ్ సాంగ్, లోగోను ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబసీ ఆఫ్ ఇండియా కౌన్సిలర్ అన్షుల్ శర్మ హాజరై, జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత సంతతి వారికి సేవ చేయడంలో 30 సంవత్సరాలుగా ఆటా ఘనమైన కృషి చేస్తూ, ముందంజలో నిలబడిందని అన్షుల్ శర్మ కొనియాడారు. ఆట అధ్యక్షులు భువనేశ్ భుజాల మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి 12 వేల మందికి పైగా తెలుగు వారు పాల్గొంటారని, అందుకు ఏర్పాట్లను తగిన ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు కోవిడ్ తర్వాత అందర్నీ కలుసుకోవడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో తెలుగు వారందరూ పాల్గొనాలని భువనేశ్ భుజాల పిలుపునిచ్చారు. ఆటా అధ్యక్షుడిగా ఎన్నికైన మధు బొమ్మినేని మహిళలు కాన్ఫరెన్స్‌లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయ్యాలని కోరారు. ఇక… 17 వ మహా సభల కన్వీనర్‌గా సుధీర్ బండారు. కోఆర్డినేటర్‌గా కిరణ్ పాశం, రవి చల్ల, సాయి సుదిని, కో డైరెక్టర్‌గా రవి బొజ్జ వ్యవహరిస్తారు. కాన్ఫరెన్స్ డైరెక్టర్‌గా కేకే రెడ్డి, కో-కన్వీనర్‌గా సాయి సుదిని, కో-కోర్డినేటర్‌గా రవి చల్ల, కో-డైరెక్టర్‌గా రవి బొజ్జ, కాట్స్ ప్రెసిడెంట్ సుధా కొండపు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అడ్వైజరీ కమిటీ చైర్‌గా జయంత్ చల్ల, రీజినల్ కోఆర్డినేటర్‌గా శ్రావణ్ పాదురు వ్యవహరించనున్నారు.
17వ మహా సభల కన్వీనర్ సుధీర్ బండారు మాట్లాడుతూ వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల లోని తెలుగు వారందరు కాన్ఫరెన్స్ గొప్పగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించవలిసిందిగా అభ్యర్ధించారు. కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ కిరణ్ పాశం మాట్లాడుతూ ఆటా తెలుగు సంస్కృతి పరిరక్షణతో పటు ఎన్నో సేవ కార్యకమాలు కూడా నిర్వహిస్తోంది అని తెలియచేసారు. కాన్ఫరెన్స్ డైరెక్టర్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ప్రారంభ సమావేసంలోనే మందికి పైగా తెలుగు పాల్గొనటం శుభసూచకం అని కొనియాడారు. అడ్విసోరీ కమిటీ అధ్యక్షులు జయంత్ చల్ల కాన్ఫరెన్స్ విజయవంతం చెయ్యటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. తానా, నాట, టీడీఫ్, నాట్స్, టాటా ,GWCTS, వారధి, తాం, ఉజ్వల మరియు ఎన్నో సంస్థలు కాన్ఫరెన్స్ కి తమ సంఘీభావం ప్రకటించాయి.
మొట్ట మొదటి సారిగా ఆటా కాన్ఫరెన్స్ అమెరికా రాజధానిలో 2022 సంవత్సరంలో జులై 1,2,3 తారీకులలో వాల్టర్ యీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. కేపిటల్ ఏరియా తెలుగు సంఘం కాట్స్ కో-హోస్ట్‌ గా వ్యవహిరిస్తోంది.

Category: