వలస వలయం || Song on Migrant workers during COVID-19

An exodus of millions of people on foot, coercing to cover hundreds of miles to reach their homes. This crisis dragged the families of these people to the roads. The visuals of stranded migrants and their long strenuous journeys back home will remain seared in our memories during the COVID-19 pandemic. This Rap, Valasa Valayam, portrays what they go through in these challenging times and the pain of the obscured support system of India. Rap written, sung and composed: Vishnu Vihari. Mixed, Mastered, Shot, and Edited: Hruday Charan. Artwork: Sundeep Bedadala. Supervision: Santosh Vemula, Tejaswini Javral. Lyrics: కడుపు చేతబట్టి కూలినాలి పక్కనెట్టి కాలి నడక మొదలుపెట్టి కదిలెనే కదంపట్టి తాకాలని ఊరి మట్టి ఆలోచన గుండె తట్టి తారాడేనే తల్లడిల్లిపోయి కంట నీరుబెట్టి కరోన కాటువేసె దాని కోరలేక్కుబెట్టి ఊరూరూ పాకింది ఇల్లుపీకి పందిరేట్టి ఎక్కడోళ్లనక్కడే సర్కారు ఆపబట్టి ముందు నుయ్యి ఎనక గొయ్యి లాకుడౌను చెయ్యబట్టి పొలీసువారు వారి లాఠీలను సానబెట్టే పొరపాటున బైటకొచ్చినోళ్ళమీద దుయ్యబట్టే పొట్టకూటికొరకు పట్టణానికొచ్చి చిక్కుకుంటే పొదమంటే పోనివ్వక పొలిమేరలో చుట్టుముట్టే బడుగుజీవినేదొ సూక్ష్మజీవి వీధిపాలుజేసె బ్రతుకుతెరువు దేవుడెరుగు బ్రతుకుతీపి గుర్తుచేసే బస్సు రైలు బందుపెట్టి రాకపోకలాపుజేస్తే బరువులన్ని మోస్తూ బాటసారి పాదయాత్రచేసె పక్కనేమి కాదు ఏన్నొ వందలాది మైళ్ళు ఒక్కరిద్దరేమికాదు లక్షలాది వీళ్ళు బక్కచిక్కిపోయె నడిచి నడిచి వీరి వొళ్ళు డొక్కశుద్ది లేనివారి పయనానికి సంకెళ్లు పన్లు లేవు కొన్నాళ్ళు ఎళ్ళిపోమన్నారు బళ్ళనుండి పిల్లగాళ్ళనెళ్లిపోమన్నారు ఇంటి ఓనర్ ఒచ్చి అద్దెకట్టి పొమ్మన్నాడు లేకపోతే ఇల్లు ఖాళి చేసిపొమ్మన్నాడు సుట్టుపక్కనోళ్లు సొంత ఊరు పోదమన్నరు కాయకష్టమేదో ఆడ చేసుకుందమన్నరు మూటముల్లె సర్దుకోని ఎళ్లిపోదామన్నరు పోతవుంటే పోలీసోళ్ళు ఆగిపొమ్మన్నరు ఇల్లు వాకిలేమిలేదు ఇప్పుడేడికెళ్లాలి పిల్లజల్ల ఆకలంటె ఏమితెచ్చిపెట్టాలి చిల్లిగవ్వ లేదు పూట ఎట్ల గడిచిపోవాలి వాన వంగిడొస్తే తడుచుకుంటు ఉండిపోవాలి ఎన్నికల్లొ సొంతూరుకు పొయ్యి ఓటు వెయ్యాలి ర్యాలీ అంటె లారీలల్లొ మందలల్లో పోవాలి కల్లబొల్లి మాటలల్లి గెలిచి గద్దె ఎక్కాలి కాని కష్టమొస్తె ఊరికొద్దు గమ్మునుండాలి బ్రతికినన్నాళ్ళు ఒక్క వోటునే నేను నా బ్రతుకన్నా నేనన్నా లెక్కలోకి రాను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేడు ఉన్నచోట ఉండలేను నా ఇంటికెళ్లలేను పొలీసు అన్న నిన్నెన్ని మాటలంటున్నా అన్నదంత మనసులో పెట్టుకోకన్నా మీరు చేసె దేశసేవకీ వందనాలన్న బ్రతుకు రోడ్డు పాలాయననే బాధలో అన్న ——————————————— Follow us on Social Media, Facebook: https://www.facebook.com/TanEntertain… Instagram: https://www.instagram.com/tanentertai… Vihari on Social Media, Facebook: https://www.facebook.com/viharimusical Instagram: https://www.instagram.com/vihari.wav/ Promotional Partner, Vamsi Krishna – https://www.instagram.com/digitalkvk/ Sateesh Akkinapally. __________________________ “Ala Ela – The VM Mixtapes” Original Song By Vihari: https://www.youtube.com/watch?v=LZ7Ow… “Newyork – The VM Mixtapes” Original song by Vihari: https://www.youtube.com/watch?v=o-5vI… View Previous Mashups here: https://www.youtube.com/channel/UC69Q… _____________________________ Under Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. We don’t own any ownership or copyright over the Images, News Footages, and articles used in the video. For further reference: https://www.youtube.com/about/copyrig… _____________________________________

SHOW MORE